యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!

- January 06, 2026 , by Maagulf
యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!

యూఏఈ: యూఏఈలో ప్రైడే ప్రార్థనల నేపథ్యంలో స్కూల్స్ పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.  ఈ మేరకు తల్లిదండ్రులకు స్కూల్స్ మేనేజ్ మెంట్లు నోటిఫికేషన్స్, ఇమెయిల్‌లు మరియు సర్క్యులర్‌లను పంపడం ప్రారంభించాయి. ఏరియాను బట్టి స్కూల్స్ వదిలేసే సమయాలు కొద్దిగా మారుతుంటాయి. విద్యార్థులను ఉదయం 11.10 గంటల నుండి వదిలివేయడం ప్రారంభించనున్నట్లు స్కూల్స్ వెల్లడించాయి.

GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ వారి స్వంత రవాణాను ఉపయోగించే విద్యార్థులు ఉదయం 11.10 మరియు 11.20 గంటల మధ్య వెళతారని, బస్సులో వెళ్లేవారు మాత్రం  ఉదయం 11.20 గంటలకు బయలుదేరుతారని తెలిపింది. ఈ మేరకు పేరెంట్స్ కు పంపిన నోటిఫికేషన్ లో వెల్లడించారు.   

జుమేరా కళాశాల తల్లిదండ్రులకు ఇచ్చిన నోట్‌లో శుక్రవారం ఉదయం 11.30 గంటలలోపు అందరు విద్యార్థులను పంపించి వేస్తామని వెల్లడించారు.   దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమీ - ఎమిరేట్స్ హిల్స్ ప్రతి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విద్యార్థులను వదులుతామని ప్రకటించారు.  

అబుదాబిలో కూడా ఇలాంటి ముందస్తు డిస్మిసల్ నోటిఫికేషన్‌లను జారీ చేస్తున్నారు.  ఒక ప్రైవేట్ పాఠశాల శుక్రవారం తరగతులు ఉదయం 8 నుండి ఉదయం 11.30 గంటల వరకు నడుస్తాయని పేరెంట్స్ కు తెలియజేసింది.  ప్రభుత్వ పాఠశాలలు కూడా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పిల్లలను వదిలేయాలని సర్క్యులర్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రార్థన సమయాలను మధ్యాహ్నం 12.45 గంటలకు సవరించిన తర్వాత షెడ్యూల్ కంటే 30 నిమిషాలు ముందుగా జరుపుకునే అవకాశం కల్పించారు. కాగా, కొత్త సమయాలు జనవరి 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com