ఆన్‌లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!

- January 06, 2026 , by Maagulf
ఆన్‌లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!

దోహా : రాబోయే ఈవెంట్ కోసం టిక్కెట్లను తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు హల్చల్ చేయడంపై ఫ్యూయల్‌ఫెస్ట్ ఖతార్ నిర్వాహకులు హెచ్చరిక జారీ చేశారు.

ఫ్యూయల్‌ఫెస్ట్ టిక్కెట్లు అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇతర వెబ్‌సైట్ లేదా లింక్ ప్రకటనల ద్వారా టిక్కెట్ అమ్మకాలు అనధికారికమని తెలిపారు. మోసపూరిత లేదా అనధికారిక మార్గాల ద్వారా పొందిన టిక్కెట్లకు నిర్వాహకులు ఎటువంటి బాధ్యత వహించరని పేర్కొన్నారు.

అభిమానులు మరియు సందర్శకులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  జనవరి 23న దోహాలోని కటారా సౌత్ పార్కింగ్‌లో ఫ్యూయల్‌ఫెస్ట్ జరుగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com