సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!

- January 06, 2026 , by Maagulf
సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!

రియాద్ః సౌదీ అరేబియాలో నేషనల్ ప్రోగ్రామ్ టు కాంబాట్ కమర్షియల్ కన్సీల్‌మెంట్ (తసత్తూర్) 3,785 తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 123  కవర్-అప్ కేసులను నమోదు చేశారు. వాణిజ్య సంస్థలు సంబంధిత నిబంధనలను పాటిస్తున్నాయో లేదో ధృవీకరించడం మరియు నేరాలు, వాణిజ్య నిరోధక కన్సీల్‌మెంట్ చట్టం ఉల్లంఘనలను గుర్తించడం ఈ తనిఖీల లక్ష్యమని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం కన్సీల్మెంట్ వ్యతిరేక చట్టం ప్రకారం.. ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR5 మిలియన్ల వరకు జరిమానా విధించడంతోపాటు ఆయా సంస్థలు, వాటి యజమానుల ఆస్తులను జప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలను మూసివేయడంతోపాటు వాటి వాణిజ్య రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com