బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్‌ 2026..!!

- January 06, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్‌ 2026..!!

మనామా: ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ లో జనవరి 22 నుండి 31 వరకు 36వ ఎడిషన్ ఆటమ్ ఫెయిర్ 2026ను నిర్వహించనున్నారు.  బహ్రెయిన్ లో ప్రముఖ వార్షిక కార్యక్రమాలలో ఈ ఆటమ్ ఫెయిర్ ఒకటని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, EWB చైర్‌పర్సన్ సారా అహ్మద్ బుహిజీ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు ఇన్ఫార్మా బహ్రెయిన్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. 36వ ఎడిషన్ ఈ ఫెయిర్ చరిత్రలో అతిపెద్ద ఎగ్జిబిషన్ గా రికార్డు సృష్టించనున్నదని పేర్కొన్నారు. 24 దేశాల నుండి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని, 2 లక్షల కంటే ఎక్కువగా విజిటర్స్ వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆటమ్ ఫెయిర్ 2026 ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లోని హాల్స్ 2, 3, 5 మరియు 6లలో జరుగుతుంది. ప్రవేశం ఉచితం. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉందని నిర్వాహకులు ప్రకటించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com