సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!

- January 06, 2026 , by Maagulf
సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!

రియాద్:  సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగం బలోపేతం కానుంది. బ్యాకింగ్ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాలలో భాగంగా ప్రపంచంలోని టాప్ 30 బ్యాంకులలో 20 బ్యాంకులను ఆకర్షించడంలో సౌదీ అరేబియా విజయం సాధించిందని ఇన్వెస్ట్ మెంట్స్ మినిస్టర్ ఖలీద్ అల్-ఫాలిహ్  తెలిపారు. షౌరా కౌన్సిల్ జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అల్-ఫాలిహ్ జాతీయ పెట్టుబడి వ్యూహాన్ని 2025లో అప్డేట్ చేసినట్లు ప్రకటించారు.

2025 చివరి నాటికి 700 కంటే ఎక్కువ ప్రపంచ కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేయబడ్డాయని, ఇది 2030 నాటికి నిర్దేశించుకున్న 500 కంపెనీల లక్ష్యాన్ని అధిగమించిందని పేర్కొన్నారు. ఈ కంపెనీలు విభిన్న రంగాలలో విస్తరించి ఉన్నాయని, ఇవి ప్రాంతీయ వ్యాపార కేంద్రాలుగాగా సౌదీ అరేబియా స్థానాన్ని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. ఇన్వెస్ట్ మెంట్ లైసెన్సులు పది రెట్లు పెరిగాయని, 2019లో 6,000 నుండి 2025 చివరి నాటికి 62,000కు చేరాయని అల్-ఫాలిహ్ చెప్పారు. 

మరోవైపు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ SR1 ట్రిలియన్ కంటే ఎక్కువ విలువైన 2వేల కంటే ఎక్కువ పెట్టుబడి అవకాశాలను గుర్తించిందని అల్-ఫాలిహ్ వెల్లడించారు. "ఇన్వెస్ట్ సౌదీ" ప్లాట్‌ఫామ్ ద్వారా మొత్తం SR231 బిలియన్లకు పైగా విలువైన ఒప్పందాలను కదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక పెట్టుబడిదారులకు న్యాయమైన పోటీని నిర్ధారించడంపై షౌరా కౌన్సిల్ సభ్యురాలు మరియు వాణిజ్య, పెట్టుబడుల కమిటీ చైర్‌పర్సన్ హనన్ అల్-సమ్మరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. స్థానిక పెట్టుబడిదారులు మంత్రిత్వ శాఖకు ప్రాధాన్యతనిస్తారని మరియు పెట్టుబడిదారులకు పెట్టుబడి సామర్థ్యం,  పోటీతత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అల్-ఫలిహ్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com