ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!

- January 06, 2026 , by Maagulf
ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!

మస్కట్: 2025 సంవత్సరం పొడవునా ఒమన్ సుల్తానేట్‌లో ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  గత సంవత్సరం జనవరి నుండి నవంబర్ వరకు వినియోగదారుల ధరల సూచీ (CPI)లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం లక్ష్య పరిధులలోనే కొనసాగుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్య విధానాలలో మార్పులు, పెరుగుతున్న కస్టమ్స్ సుంకాలు భవిష్యత్ ద్రవ్యోల్బణంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నప్పటికీ, ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పరిమితంగానే ఉన్నాయిని మంత్రిత్వశాఖ తెలిపింది.

పదవ పంచవర్ష ప్రణాళిక (2021–2025) సంవత్సరాలలో ఒమన్‌లో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటానికి ప్రభుత్వ చురుకైన విధానాలే కారణమని మంత్రిత్వ శాఖ చెప్పింది. 2021 నుండి ప్రపంచ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. తద్వారా ప్రపంచ ధరల పెరుగుదల ప్రభావం స్థానిక మార్కెట్లపై పడకుండా చర్యలు తీసుకున్నామని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ 2025లో రెపో కార్యకలాపాలపై వడ్డీ రేట్లను అనేకసార్లు తగ్గించింది.  2024 చివరిలో 5 శాతం నుండి డిసెంబర్ 2025 నాటికి 4.25 శాతానికి తగ్గింది. 2025 నాటి కీలక బ్యాంకింగ్ డేటా ప్రకారం, బ్యాంకింగ్ రంగం అందించిన మొత్తం రుణం 9 శాతం వృద్ధితో అక్టోబర్ 2025 చివరి నాటికి OMR 34.7 బిలియన్లకు చేరుకుంది.

జనవరి నుండి నవంబర్ 2025 వరకు వినియోగదారుల ధరల సూచీ (CPI)లో వివిధ ధరల మార్పులను మంత్రిత్వ శాఖ వివరించింది.  ఫుడ్, కూల్ డ్రింక్స్ ధరలు 0.33 శాతం తగ్గాయి. గృహనిర్మాణం, నీరు, విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్స్ వంటి విభాగాలు స్థిరంగా ఉన్నాయి. సేవల ధరలు 6.8 శాతం, రవాణా 3.2 శాతం, రెస్టారెంట్లు మరియు హోటళ్లు 1.8 శాతం, ఆరోగ్యం 1.5 శాతం పెరిగాయి. క్లాత్, ఎడ్యుకేషన్ లో సుమారు 0.45 శాతం స్వల్ప పెరుగుదల కనిపించింది.

ఇక అల్ దఖిలియా గవర్నరేట్‌లో అత్యధికంగా 1.63 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.  ఆ తర్వాత అల్ ధాహిరా 1.54 శాతం, ముసందమ్ 1.21 శాతం ఉన్నాయి. ఉత్తర అల్ షర్కియాలో ఒమన్‌లోనే అత్యల్పంగా 0.29 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com