జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- January 07, 2026
యూఏఈ: దుబాయ్ మునిసిపాలిటీ జుమేరా బీచ్1 అభివృద్ధి పనులను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సమీక్షించారు. నివాసితులు మరియు సందర్శకుల అనుభవాన్ని పెంచడానికి, బీచ్ టూరిజంకు ప్రముఖ ప్రపంచ గమ్యస్థానంగా ఎమిరేట్ స్థానాన్ని బలోపేతం చేయడానికి దుబాయ్ విస్తృత ప్రణాళికలలో ఈ ప్రాజెక్ట్ భాగమని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా బీచ్ ప్రాంతాన్ని 50 శాతం విస్తరించారు. ఇందులో 95 శాతం పనులు పూర్తయ్యాయి. దుబాయ్ తన బీచ్‌లను ప్రపంచంలోనే అత్యుత్తమంగా మరియు అందంగా తీర్చిదిద్దుతున్నట్లు తన X పోస్ట్‌లో తెలిపారు. వాకింగ్, సైక్లింగ్ మరియు జాగింగ్ ట్రాక్‌లతో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు ఇంటిగ్రేటెడ్ ఎంటర్ టైన్ మెంట్ మరియు క్రీడా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. జుమేరా బీచ్ 1 ఫిబ్రవరిలో సందర్శకులను స్వాగతం పలుకుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!
- నార్త్ బతినాలో ప్రవాసి హత్య..నిందితుడు అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో అక్రమ స్ట్రీట్ రేసింగ్.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!
- యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!







