మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!

- January 07, 2026 , by Maagulf
మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!

దోహా: ఖతార్ లో మెట్రాష్ మొబైల్ అప్లికేషన్‌లోని భద్రతా విండో ద్వారా అందుబాటులో ఉన్న “అల్-అదీద్” సేవను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ  హైలైట్ చేసింది. దీని వలన వినియోగదారులు నేరుగా భద్రతా విభాగానికి ఫిర్యాదు సమర్పించవచ్చని తెలిపింది. ప్రజా నైతికత ఉల్లంఘనలు, బెదిరింపులు, ర్యాటక ప్రాంతాలలో ఉల్లంఘనలు , అవినీతి కేసులు వంటి అనేక సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.ఈ సేవ  భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడానికి తీసుకుంటున్న ప్రయత్నాలలో భాగమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com