ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- January 07, 2026
జకార్తాః ఇండోనేషియాలోని పశ్చిమ జావా, సుకబుమిలోని పెలాబుహన్రతులోని బుబాలు బీచ్లో జెట్ స్కీ బోల్తా పడటంతో 39 ఏళ్ల సౌదీ పౌరుడు మరణించాడని ఇండోనేషియా తెలిపింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు జకార్తాలోని సౌదీ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ సౌదీ పౌరుడు, ఒక ఇండోనేషియా మహిళ తీరప్రాంత పర్యాటక కేంద్రంలో ఒడ్డుకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తుండగా వారు ప్రయాణిస్తున్న జెట్ స్కీ బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ఆ ఇండోనేషియా మహిళ పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పలాబుహన్రతు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!







