బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- January 07, 2026
మనామాః బహ్రెయిన్ ప్రజా రవాణా వ్యవస్థ సాధారణ రోజులలో సుమారు 33,000 బస్సు ట్రిప్పులను నమోదు చేస్తుంది. వారాంతాల్లో ఇది 50,000కి మరియు ఏవైనా కార్యక్రమాల సమయంలో 75,000 వరకు పెరుగుతుందని రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పార్లమెంటుకు తెలిపారు. ఈ గణాంకాలు సామూహిక రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు-లైన్ల బహ్రెయిన్ మెట్రో ప్రణాళికలకు మద్దతు ఇస్తాయని, రతిపాదిత మార్గాలు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సీఫ్ వరకు మరియు జుఫైర్ నుండి విద్యా ప్రాంతం వరకు నడుస్తాయని వివరించారు. బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. బహ్రెయిన్ లో ప్రజా రవాణాను విస్తరించడంలో ఇది కీలకమని అభివర్ణించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం
- హైదరాబాద్: కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్..
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి అదనపు బ్యాగేజ్ పై ప్రత్యేక రాయితీలు
- నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ







