బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్‌ఫామ్ కు డిమాండ్..!!
- January 07, 2026
మనామా: బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ సర్వీస్ ప్లాట్‌ఫామ్ కోసం పార్లమెంట్ లో ఎంపీలు డిమాండ్ చేశారు. వారికి అవసరమైన సేవలు, ఉపాధి తదితర అంశాల్లో ప్రభుత్వ సంస్థలను అనుసంధానం చేయడానికి జాతీయ స్థాయిలో ఒక ఆన్ లైన్ వేదిక అత్యవసరమని ఎంపీలు ప్రతిపాదించారు.
వికలాంగుల సేవల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ట్రాక్ చేయడానికి మరియు తమ అభ్యర్థనలను సమర్పించేందుకు ఒక ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఉండాలని ఎంపీలు సూచించారు. ఎంపీలు మమ్దూహ్ అల్ సలేహ్, అబ్దుల్వహిద్ కరాటా, లుల్వా అల్ రుమైహి మరియు మునీర్ సెరూర్ లతో కలిసి ఎంపీ జలీలా అలవి ఈ ప్రతిపాదనను పార్లమెంటులో సమర్పించారు.
వికలాంగుల కోసం సేవలు, వారి ఉపాధి మరియు పునరావాసానికి సంబంధించి ఒక యూనిఫైడ్ జాతీయ వేదిక ఏర్పాటు అవసరాన్ని వివరించారు. వికలాంగ ఉద్యోగార్థులను కార్మిక మంత్రిత్వ శాఖ మరియు సివిల్ సర్వీస్ బ్యూరోకు అనుసంధానించే జాతీయ స్థాయిలో యూనిఫైడ్ వేదిక లేకపోవడం వల్ల వారు ఉపాధి పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ ప్రతిపాదనల్లో ఎంపీలు వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్‌కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్







