దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- January 10, 2026
దోహా: భారతీయ దౌత్య కార్యాలయం, ఖతార్ ఆధ్వర్యంలో, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) సహకారంతో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం దోహాలోని ఐసీసీ అశోక హాల్‌లో జరిగింది.
ప్రవాస భారతీయులు దేశానికి, సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తారు.ఈ ఏడాది వేడుకల్లో “నారి శక్తి–మహిళల శక్తి” అనే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.భారతీయ సమాజానికి విశేష సేవలందిస్తున్న మహిళా నాయకులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నారి శక్తి సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు.నాయకత్వం, సేవాభావం, సమాజ అభివృద్ధికి చేసిన విశిష్ట కృషిని గుర్తించేలా ఈ పురస్కారాలు అందజేశారు.
ఖతార్‌లో భారతీయ సమాజానికి చేసిన సేవలకు గాను నందిని అబ్బగౌని కి నారి శక్తి సమ్మాన్ పురస్కారం అందజేయడం విశేషం.భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆమె పాత్ర ప్రశంసనీయమని, అలాగే భారత్–ఖతార్ మైత్రి బలోపేతానికి ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తించారు.
ఈ కార్యక్రమానికి భారతీయ దౌత్య కార్యాలయ అధికారులు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుక, ప్రవాస భారతీయుల ఐక్యతను మరోసారి చాటిచెప్పింది.
ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు విజయవంతంగా ముగియగా, పురస్కార గ్రహీతలందరికీ భారతీయ దౌత్య కార్యాలయం హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







