అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం
- January 10, 2026
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని రామకృష్ణ మిషన్ పాఠశాల వజ్రోత్సవ వేడుకలు ఆద్యంతం ఆనందభరితంగా సాగాయి.రామకృష్ణ మిషన్ స్కూల్ ఏర్పాటైన విధానం, నడిపిస్తున్న తీరు, పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం మరువలేనిదని శితికంఠనంద స్వామీ వెల్లడించారు. పాఠశాలలో జ్ఞాపకాలను స్మరిస్తూ పూర్వపు విద్యార్థులు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రామకృష్ణ మిషన్ స్కూల్ లో చదివి ..ఉన్నత స్థానాలకు ఎదిగి ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అంతా ఒక్క చోట చేరి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ పాఠశాలను తొలుత రామకృష్ణ విద్యాలయంగా ప్రారంభించిన వ్యవస్థాపకులు బాపిరాజు ఆశయాన్ని పూర్వ విద్యార్థి అడపా వెంకట పుల్లరావు ప్రశంసించారు.అవకాశం ఉన్నవారిని ప్రత్యక్ష్యంగా , కుదరని పక్షంలో టెక్నాలజీ సహకారంతో వాట్సాప్ సందేశాలు, గ్రూపుల్లో ఆహ్వానం పలుకుతూ సుమారు 80 మంది పూర్వ ఉపాధ్యాయులు, 800 పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.రామకృష్ణ మిషన్ వారికి అప్పగించాక పాఠశాలలో 60 ఏళ్లుగా సంస్కారం, విలువలు కొనసాగుతుండడం మెచ్చుకోవాల్సిన విషయమని పుట్టా భాస్కర్ వెల్లడించారు.వజ్రోత్సవ వేడుకలలో పూర్వ విద్యార్థుల కలయికలు, గత స్మృతుల కలబోతతో వేడుక కనుల పండువగా జరిగింది.
'ఈ బెంచీలో కూర్చొనేవారం, ఇదే మా తరగతి గది, ఆటస్థలంలో ఇలా ఆడుకున్నాం, ఈ ఆడిటోరియంలో ఈ పాట పాడాం, నృత్యం చేశాం,ఇక్కడే ఉపాధ్యాయులతో ప్రశంసలందుకున్నాం' అంటూ తమ అనుభూతులను మరోసారి తలచుకుంటూ ఆనందంగా గడిపారు. బ్యాచ్ లు బ్యాచ్ లుగా ఆ నాడు విద్య బోధించి దారిలో పెట్టిన ఉపాధ్యాయుల బృందంతో ఫోటోలు దిగారు.నిర్వాహక కమిటీ సభ్యులు సభ్యులు పుట్టా భాస్కర్ రావు, రామారావు, అడపా వెంకట పుల్లారావు, సిద్దె రఘు, సీహెచ్ సాయిరాం నేతృత్వంలో చదువు, సంస్కారం నేర్పని ఉపాధ్యాయులను పూలగుచ్ఛం అందచేసి శాలువాతో సన్మానించుకున్నారు. వజ్రోత్సవ వేడుకలలో భాగంగా పాఠశాల చిన్నారులు ఆలపించిన దేశభక్తి గీతాలు, భరతనాట్యం, కోలాటం ప్రదర్శన సహా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పూర్వ విద్యార్థి, ప్రస్తుత సంగీతాచార్యులు వైష్ణవి ఆలపించిన దేశభక్తి గీతం ప్రత్యేకంగా నిలిచింది.రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చిలానంద, సహాయ కార్యదర్శి స్వామీ శితికంఠానంద, ప్రధానోపాధ్యాయులు సీహెచ్ సుధాకర్ కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆహ్వానించి కార్యక్రమం విజయవంతంలో సహకరించిన ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు గౌరీ, దుర్గాభవానీ, శివనాగలక్ష్మి తదితర ఉపాధ్యాయుల కృషికి ధన్యవాదాలు తెలియజేశారు.

తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







