షార్జాలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నభారతీయుడు

- July 28, 2016 , by Maagulf
షార్జాలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నభారతీయుడు

 షార్జా  తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నభారతీయుని మరణానికి సంబంధించిన పరిస్థితులు ఎందుకు సంభవించాయో తెలుసుకొనేందుకు షార్జా పోలీస్ పరిశోధన ప్రారంభించారు. షార్జా లోని అల్ ఇట్టిహాడ్ అల్ నాభ ప్రాంతంలో ఒక భారతీయుడు తన అపార్ట్మెంట్ లో ఒక  సీలింగ్ ఫ్యాన్ కు  ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో తక్షణమే ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు. ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితుల గూర్చి సమీక్షించారు. .పబ్లిక్ ప్రాసిక్యూటర్ భారతీయుని  మరణానికి కారణం  గుర్తించడానికి ఫోరెన్సిక్ ప్రయోగశాలకు ఆ వ్యక్తి భౌతికకాయాన్ని బదిలీ చేయమని  ఆదేశించించారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com