శస్త్రచికిత్స తర్వాత వైద్యపరంగా మృతి ... ప్ర్రాణం పోసుకున్న భారతీయ బాలుడు

- July 28, 2016 , by Maagulf
శస్త్రచికిత్స తర్వాత  వైద్యపరంగా మృతి ... ప్ర్రాణం పోసుకున్న భారతీయ బాలుడు

దుబాయ్ :  వైద్యపరంగా మృతి చెందిన  భారతీయ బాలుడు అనూహ్యంగా తిరిగి  ప్ర్రాణం పోసుకున్న ఘటన పలువుర్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. దుబాయ్-ఆధారిత రెండు సంవత్సరాల భారత బాలునికి  వైద్యులు అతని గుండె నుండి ఒక భారీ కాన్సర్ కణితిని తొలగించేందుకు  తొమ్మిది గంటలపాటు  శస్త్రచికిత్స జరిపి అతను క్లినికల్లీ డెడ్ అని తేల్చివేశారు. వైద్యులు ఒక 200 గ్రామల ఇంట్రకార్డియక్  యోక్ శాక్ జెర్మ్ సెల్ తన హృదయంలో ఉన్న కణితి (సగటున దానిమ్మ కాయ బరువు, ఆకారంతో పోలి ఉండే ) ని  తొలగించడానికి శస్త్రచికిత్స ద్వారా ఎంతో శ్రమించారు.    ఆది తొప్పిల్  ఫాబెర్ ( 2 ) భారతీయ బాలునికి   లోతైన హైపోథెర్మిక్ ( అతి శీతలీకరణ ) ద్వారా   రక్తప్రసరణ ఆగిపోవడం జరిగిందని భారత మీడియా నివేదించింది.ఈ శస్త్రచికిత్స పద్ధతిలో  వైద్యులు 15 సెంటీగ్రేడ్ బాలుని  శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గించాలని నిర్ణయించారు వైద్యులు ఆ ప్రక్రీయను సైతం సాధించారు. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. ఇది సాధారణంగా మానవ శరీర ప్రధాన శరీర ఉష్ణోగ్రత కంటే తగ్గితే 22 సెంటీగ్రేడ్ తగ్గితే  చనిపోయినట్లయగా వైద్యులు ప్రకటిస్తారు.30 మంది వైద్యుల బృందం ఇటీవల ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. బాలుని  పరిస్థితి చాలా అరుదు కనుక  వారు హాజరయ్యారు, కేరళ లోని  కొచీ  లేక్షోర్ హాస్పిటల్ వద్ద గుండె మార్పిడి శాఖ, కార్డియాక్ సర్జరీ ముఖ్యులు. డాక్టర్ ఎం.కె  మోసే  కున్హి ,30 మంది వైద్యుల జట్టుకు నాయకత్వం వహించారు. గుండె లోపల 200 గ్రాముల కాన్సర్ కణితిని శస్త్రచికిత్స ద్వారా ప్రపంచంలో ఇప్పటివరకు నాలుగు కేసులు మాత్రమే జరిగేయని, ఇది 5 వ కేసు అని గతంలో జరిగిన కేసులలో గుండె లోపల మాత్రమే కణితి ఉన్నాయని , అయితే భారతీయ బాలునికి గుండె వెలుపల ,లోపల  కాన్సర్ కణితిని విస్తరించి ఉందని డాక్టర్ కున్హి తెలిపారు.   బాలుని తల్లిదండ్రులు, గత 10 సంవత్సరాలుగా దుబాయ్ లో పని చేస్తున్నారు, తమ పిల్లవాడికి ఇటీవల జ్వరం రావడంతో తల్లితండ్రులు అతని ఆరోగ్య పరిస్థితిని  కనుగొన్నారు.  చికిత్స కోసం దుబాయ్ లోని  ఒక ఆసుపత్రికి తరలించారు. దుబాయ్ లోని వైద్యులు కేరళలోని ఆసుపత్రికి  ప్రయాణం చేయడంకు  అనుమతి నిరాకరించినప్పటికీ, తాను తన భర్త  తమ  కుమారుడిని చికిత్స కోసం కొచీ  తీసుకువెళ్లాలనే  నిర్ణయిమే తమ బిడ్డ ప్రాణాలు దక్కేయని వారు సంతోషం వ్యక్తం చేశారు ఆది తొప్పిల్  ఫాబెర్ (2)  ఆసుపత్రిలో చేరుకున్న తర్వాత  అతని  రక్త ప్రసరణ 95 శాతం ఆప్పటికే కణితి  బ్లాక్అడ్డుకొంటున్న స్థితిలో ఉందని ఎంతో ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో  ఈ శస్త్రచికిత్స నిర్వహించామని  డాక్టర్ కున్హి  చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com