ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- January 12, 2026
ఇరాన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశంపై యూఎస్ సైనిక జోక్యానికి దిగితే, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వార్నాంగ్ ఇచ్చారు.
అయితే, ఆందోళనకారులకు ఏదైనా జరిగితే రంగంలోకి దిగుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ఓ కార్టూన్ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. అహంకారం, గర్వం తలకెక్కి ఈ ప్రపంచాన్నే శాసించాలని అనుకుంటున్నాడంటూ ఆ పోస్ట్ లో తెలిపారు. అమెరికా తమపై దాడి చేస్తే ఇజ్రాయెల్న లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ను ఒక దేశంగా ఇరాన్ గుర్తించదని, పాలస్తీనా నుంచి ఆక్రమించుకున్న భూభాగంగా మాత్రమే పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్లతో ఆర్థిక, మేధో, సైనిక, ఉగ్రవాద రంగాల్లో పోరాడుతోందని ఖమేనీ పేర్కొన్నారు.ఇరాన్ తాజా హెచ్చరికలతో ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







