జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

- January 13, 2026 , by Maagulf
జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

దోహా: ఖతార్ లో ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్‌గార్టెన్‌లులో సామాజిక బాధ్యత ప్రాజెక్ట్ కింద ఫ్రీ, రాయితీ సీట్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 20న ప్రారంభమవుతుందని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 3,500 ఉచిత మరియు రాయితీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఒకసారి చేరిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టు కింద చదువుకోవచ్చని పేర్కొంది.
మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో పూర్తిగా ఉచిత సీట్లు, రాయితీ సీట్లు, వికలాంగ విద్యార్థుల కోసం కేటాయించిన ఉచిత సీట్లు,  ఖతారీ విద్యార్థుల కోసం సీట్లతో సహా అనేక రకాల సీట్లు ఉన్నాయని విద్యామంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని జాతీయతలకు చెందిన కుటుంబాలకు ఈ సీట్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఉచిత సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే కుటుంబ మొత్తం ఆదాయం 10,000 ఖతారీ రియాల్స్‌ను మించకూడదని తెలిపింది. ఇక రాయితీ సీట్ల కోసం ఆదాయ పరిమితి 15,000 రియాల్స్‌గా నిర్ణయించారు. బ్రిటిష్, ఇండియన్, అమెరికన్ మరియు నేషనల్ సిలబస్ స్కూళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com