'పల్నాడు'- టైటిల్ పోస్టర్ రిలీజ్

- January 16, 2026 , by Maagulf
\'పల్నాడు\'- టైటిల్ పోస్టర్ రిలీజ్

రోహిత్ వర్మ వర్మ హీరోగా గోవింద రెడ్డి చందా దర్శకత్వంలో క్రేజీ కింగ్స్ స్టూడియోస్ LLP బ్యానర్ పై ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది.  రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అందించిన మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని రివిల్ చేశారు. ఈ చిత్రానికి 'పల్నాడు' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఎగిరే నిప్పురవ్వల బ్యాక్ డ్రాప్ లో హీరో మండుతున్న కర్రని పట్టుకొని, పవర్‌ఫుల్‌ ఇంటెన్స్‌ గా కనిపించిన టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీ క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్ కుమార్, దేవి ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. రవికుమార్.వి డీవోపీ, ఎడిటర్  చోటా కె ప్రసాద్.

నటీనటులు: రోహిత్ వర్మ, రియా సుమన్, హరీష్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్ కుమార్, దేవి ప్రసాద్, నిఖిల్ దేవదూల, అక్షర నల్లా, బలగం సంజయ్, టెంపర్ వంశీ, శ్రవణ్, శుభోదయం సుబ్బారావు, నాగ మహేష్, శంకర్ మహంతి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్  

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం:గోవింద రెడ్డి చందా
బ్యానర్: క్రేజీ కింగ్స్ స్టూడియోస్ LLP
సంగీతం - మణిశర్మ
D.O.P – రవికుమార్.వి
ఎడిటర్ - చోటా కె ప్రసాద్
స్టంట్స్ - నట్రాజ్, అంజి, శంకర్
కొరియోగ్రాఫర్స్ - ఈశ్వర్ పెంటి, నిక్సన్
లిరిక్ రైటర్స్ - శ్రీ హర్ష ఈమని, రఘురామ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - ప్రభాకర్ రాజు
P.R.O - వంశీ, శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com