న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- January 18, 2026
జజాన్: కొత్త జజాన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును జజాన్ ప్రాంతం ఎమిర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి గురించిన వివరాలను ఎమిర్ కు అధికారులు వివరించారు. నిర్మాణ పనులు 92 శాతం వరకు పూర్తయినట్లు పేర్కొన్నారు.
విమానాశ్రయం ఏటా 5.4 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించేలా నిర్మిస్తున్నారు. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, సేవలను ఇది కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ విమానాశ్రయం దాదాపు 48 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 57,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక ప్రధాన ప్రయాణీకుల టెర్మినల్, 12 బోర్డింగ్ గేట్లు, 10 ఎయిర్ క్రాఫ్ట్ బ్రిడ్జిలు, 32 చెక్-ఇన్ కౌంటర్లు, ఎనిమిది సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ లు, 2,000 పార్కింగ్ స్థలాలు, నాలుగు వెయిటింగ్ లాంజ్లు మరియు గంటకు 2,400 బ్యాగులను ప్రాసెస్ చేయగల స్మార్ట్ హ్యాండ్లింగ్ సిస్టమ్తో కూడిన నాలుగు బ్యాగేజ్ బెల్ట్లు ఉంటాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







