విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- March 10, 2026
దోహా: తమ దేశంలో పర్యటించే విజిటర్స్ కు ఖతార్ సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ చేసింది. ముఖ్యంగా జాతీయ హెచ్చరిక వ్యవస్థ ద్వారా ముందు జాగ్రత్త హెచ్చరికలు అందుకున్నప్పుడు ఎలా స్పందించాలో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ మేరకు మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్‌కు వచ్చే సందర్శకులకు భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని , ప్రజా భద్రతను నిర్ధారించడానికి భద్రతా సిబ్బందితో సహకరించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
ముఖ్యమైన మార్గదర్శకాలు :
జాతీయ హెచ్చరిక వ్యవస్థ జారీ చేసిన హెచ్చరిక నోటిఫికేషన్లను తీవ్రంగా పరిగణించాలి. అధికారులు సూచనలను పాటించాలి.
భవనం లోపల సురక్షిత ప్లేసులో ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక ప్రమాదం లేదని అధికారిక సూచనలు నిర్ధారించే వరకు ఇళ్లలోనే ఉండాలి.
ఏదైనా పేలుడు శబ్దం విన్నట్లయితే లేదా జాతీయ హెచ్చరిక నోటిఫికేషన్ అందితే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
బహిరంగ ప్రాంతాల్లో ఉండకూడదు. సమీపంలోని సురక్షిత భవనాలకు వెంటనే వెళ్లి కిటికీలు, గ్లాస్ వస్తువులకు దూరంగా ఉండాలి.
షాపింగ్ మాల్స్ లేదా మార్కెట్లలో అత్యవసర ఎగ్జిట్ మార్గాలను ముందే తెలుసుకోవాలి.
తరలింపు అవసరమైతే, మెట్లు మరియు అత్యవసర ఎగ్జిట్ లను ఉపయోగించాలి. లిఫ్ట్‌లకు దూరంగా ఉండాలి.
రద్దీ గా ఉండే ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
అనుమానాస్పద వస్తువులను టచ్ చేయడానికి ప్రయత్నించవద్దు.
ఏవైనా అనుమానాస్పద వస్తువులను గమనించినట్లయితే వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాలి.
తెలియని వస్తువుల సమీపంలోకి వెళ్లవద్దు. సైట్లో ఉన్న వస్తువులు లేదా శకలాలకు దూరంగా వెళ్లాలి.
ఆయా సంఘటనలను ఫోటో/వీడియో తీసేందుకు ప్రయత్నించవద్దు.
భద్రతా సిబ్బందితో సహకరించాలి. భద్రతా సిబ్బంది సూచనలను పాటించాలి. అత్యవసర సమయాల్లో వారికి సహకరించాలి.
ఈ భద్రతా మార్గదర్శకాలను పాటించడం సందర్శకుల భద్రతను నిర్ధారించడంలో సహాయపడుతుందని మరియు అత్యవసర పరిస్థితులను నిర్వహించడంలో భద్రతా అధికారుల ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







