దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- January 18, 2026
దోహా: దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నామినేషన్లు ప్రారంభించింది. మార్చి 1 వరకు నామినేషన్లను సమర్పించవచ్చని తెలిపింది. స్థానిక మరియు అంతర్జాతీయ స్థాయిలో పబ్లిషింగ్ పరిశ్రమను పెంపొందించడంలో దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన పోషించిన పాత్రను వెలుగులోకి తీసుకురావడం ఈ అవార్డు లక్ష్యమని ప్రకటించారు.
ఎనిమిది కేటగిరుల్లో నామినేషన్ సమర్పించేందుకు నిబంధనలు, ప్రమాణాల ప్రకారం ప్రచురణ సంస్థలు మరియు రచయితలు మేధో సంపత్తి చట్టాలను పాటించాలి. అధికారిక వెబ్సైట్ ద్వారా వారి ప్రచురణలను డిజిటల్ ఫార్మాట్లో సమర్పించాలి. ఇటీవలి ప్రచురణలను PDF ఫార్మాట్లో అవార్డు వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలి. ప్రతి కేటగిరీకి QAR 20,000 నుంచి QAR 40,000 వరకు విలువైన బహుమతులను అందజేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







