విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!

- January 19, 2026 , by Maagulf
విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!

దోహా: విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1 నుండి అబు సమ్రా మీదుగా ఖతార్‌లోకి ప్రవేశించే విదేశీ వాహనాలు.. దేశంలోకి ప్రవేశించే ముందు ఎలక్ట్రానిక్‌గా వెహికల్ ఇన్సూరెన్స్ ను పొందే అవకాశాన్ని కల్పించారు. ఇది బార్డర్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేస్తుందని ప్రకటించారు.

ఖతార్ యూనిఫైడ్ ఇన్సూరెన్స్ బ్యూరో MSAR అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను ప్రారంభించింది.  ఇది పర్యాటకులు వెహికల్ ఇన్సూరెన్స్ ప్రక్రియలను ఎలక్ట్రానిక్‌గా పూర్తి చేయడానికి అనుమతిస్తుంది.  వాహనదారులు యాప్ ద్వారా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిరంతరం అవసరమైన టెక్నికట్ సపోర్టును కూడా పొందవచ్చు.   

అయితే, చెల్లుబాటు అయ్యే ముందస్తు ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకు బార్డర్ వద్ద ప్రత్యేక లేన్ ఉంటుందని, ఇది వేగవంతమైన ఎంట్రీ ప్రక్రియకు వీలు కల్పిస్తుందని ఒక MSAR అధికారి వెల్లడించారు. కాగా, ఖతార్‌కు ఒకవేళ పర్యటన రద్దు అయిన సందర్భంలో ఇన్సూరెన్స్ ను సైతం రద్దు చేసుకుని, డబ్బులను రీ ఫండ్ పొందడానికి కూడా ఈ అప్లికేషన్‌లో అవకాశం ఉంటుందని ఆ అధికారి తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com