సాహసాల ప్రయాణం ఏ రీతిన సాగింది?

- July 28, 2016 , by Maagulf
సాహసాల ప్రయాణం ఏ రీతిన సాగింది?

అ తను సాదాసీదా కుర్రాడు. అందరిలానే కలలు కన్నాడు. వాటిని సాకారం చేసుకొందామనుకొన్నాడు. దాంతో పాటు ఆ వయసులో చేయాల్సిన అల్లరినీ వదల్లేదు. జీవితమంతా ఇలానే సాఫీగా సాగిపోతుందని భావించాడు. కానీ ఒక్కసారిగా విధి అతని జీవితంతో ఆడుకోవడం మొదలెట్టింది. ఆశలన్నీ ఆవిరయ్యాయి. కానీ పోరాటం మాత్రం ఆపలేదు. ఇంతకీ ఆ కుర్రాడి లక్ష్యమేంటి? అతని ప్రయాణం ఏ రీతిన సాగింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చూడాల్సిందే. నాగచైతన్య, మంజిమ మోహన్‌ జంటగా నటించిన చిత్రమిది. గౌతమ్‌ మేనన్‌ దర్శకుడు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఆగస్టు 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్‌ మాట్లాడుతూ ''గౌతమ్‌ మేనన్‌, నాగచైతన్య, ఏఆర్‌ రెహమాన్‌ కలయిక ఎంత మ్యాజిక్‌ చేసిందో చెప్పక్కర్లేదు. 'ఏ మాయ చేసావె'లానే ఈ చిత్రం కూడా అందరి అంచనాలనూ అందుకొంటుంది. వినోదం, యాక్షన్‌, ప్రేమ, భావోద్వేగాలూ, మంచి సంగీతం మేళవించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుంద''న్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com