భరణి దర్శకత్వం లో వినాయక్...
- July 28, 2016
టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరైన వినాయక్ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు. మిథునం సినిమాతో తనకంటూ ప్రత్యేకతను చాటిన తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోయే ఓ షార్ట్ఫిలింకు ఈ మాస్ డైరెక్టర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. భరణి దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిలింకు 'లాస్ట్ ఫార్మర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ షార్ట్ఫిలిం నిర్మిస్తున్న వినాయక్... మంచి కథతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ దొరికితే మరిన్ని వాటిని నిర్మించేందుకు రెడీ అంటున్నాడు. మరోవైపు చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నాడు వినాయక్. ఇదిలాఉంటే.. గతంలో తనికెళ్ల భరణి తెరకెక్కించిన 'సిరా' చిత్రం మంచి పేరును పొంది విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా 'మిథునం' చిత్రం కూడా మంచి గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న షార్ట్ఫిలిం త్వరలో పట్టాలెక్కనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







