భవన ఉల్లంఘనలపై తనిఖీ పరీక్షలు నిర్వహణ

- July 28, 2016 , by Maagulf
భవన ఉల్లంఘనలపై తనిఖీ  పరీక్షలు  నిర్వహణ

దోహా: అల్ షామల మున్సిపాలిటీ లోని సాంకేతిక పర్యవేక్షణ విభాగం ఇటీవలి జరిపిన తనిఖీలు  సందర్శనల సమయంలో భవనాలు త్రవ్వకం విషయంలో  నియంత్రణ చట్టంకు సంబంధించి పలు ఉల్లంఘనలకు వారు పాల్పడినట్లు గుర్తించి పట్టుకుంది.ఈఉల్లంఘనలలో పాదచారులకు భద్రత నిర్ధారించడానికి అవసరమైన విధానాలు తీసుకోకపోవడం  , చెత్త చెదారాలు వేయకూడని  ప్రదేశాల్లో విసిరివేయబడే వ్యర్ధాలు, నిర్మాణం జరిగే స్థలం చుట్టూ కంచెలు కట్టకపోవడం తదితర ఉల్లంఘలనల ఉన్నాయి. పైన పేర్కొన్న ఉల్లంఘనలు ఉల్లంఘించినవారిపై అవసరమైన చర్యలు  తీసుకోబడ్డాయి మరియు కూడా ఇతర ఉల్లంఘనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోనున్నారు. ఆలా రేయాన్ మున్సిపాలిటీ అల్ కరణ  కార్యాలయం 92 తనిఖీ పర్యటనలు నిర్వహించింది , దీని ద్వారా 24 ఉల్లంఘనలను గుర్తించింది, రెండు వదిలివేయబడిన వాహనాలు ఆ ప్రాంతం నుంచి  తొలగించడంజరిగిందని, నాలుగు ప్రదేశాల్లో తవ్వకం అనుమతి లేనిచోట్ల నిర్మాణాలు జరగడం వంటి ఉల్లంఘనలకు పాల్పడటం గుర్తించారు . ఈ ఉల్లంఘనలకు  మొత్తం మొత్తం 43,975 కతర్ రియళ్ళు జరిమానాగా విధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com