'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

- January 20, 2026 , by Maagulf
\'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్\' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.

దునియా విజయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రబృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో ఆయన రఫ్‌ లుక్‌లో కనిపించడం ఆకట్టుకుంది. స్లీవ్‌లెస్ గ్రీన్ వెస్ట్, బోల్డ్ పెండెంట్, బ్రౌన్ హ్యాట్‌తో ఆయన స్టైలింగ్ అదిరిపోయింది. ఆయన ఎనర్జిటిక్ ఎక్స్‌ప్రెషన్, స్ట్రీట్-స్మార్ట్, పవర్‌ఫుల్ వైబ్‌ను ఇచ్చాయి. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని పూర్తిగా కొత్తగా ఉండబోతోంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ లు హ్యుమరస్ పాత్రల్లో నటిస్తున్నారు.

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్, 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో  గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ కానుంది.

తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల
సమర్పణ: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com