పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- January 20, 2026
ఆంధ్రప్రదేశ్‌ను (WEF) మించిన ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో తాము పాటిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాలను చూసిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ను (WEF) మించిన ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో తాము పాటిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాలను చూసిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన (WEF) మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడుల గమ్యస్థానం మాత్రమే కాదని, అది ఒక వ్యూహాత్మక ప్రయోజనం (స్ట్రాటజిక్ అడ్వాంటేజ్) అని పారిశ్రామిక దిగ్గజాలకు చెప్పినట్లు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. భారత్‌లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) దాదాపు నాలుగో వంతు వాటాతో, మా వ్యాపార నిర్వహణ వేగం ఏపీని ఒక ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టింది. దీర్ఘకాలిక వృద్ధి కోసం మాతో భాగస్వాములు కావాలని ప్రపంచ పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాను అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
2047 నాటికి భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని, ఈ పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని అధికారిక విడుదల వెల్లడించింది. ఈ సెషన్లో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఫ్యూయల్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలపై చర్చ జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







