మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో ఎలా మార్చాలో తెలుసా?
- January 20, 2026
మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే, మీ లైసెన్స్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చాలా? ఇటీవలే మీరు కొత్త మొబైల్ నెంబర్ తీసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లో పాత మొబైల్ నెంబర్ కూడా వెంటనే మార్చుకోండి. మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.
ఎందుకంటే.. మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని డేటా, అప్లికేషన్ స్టేటస్, రెన్యువల్ ఇతర ముఖ్యమైన మెసేజ్‌లు, మీ మొబైల్ నంబర్‌కు వస్తుంటాయి. ఆన్‌లైన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మీ మొబైల్ నంబర్‌ను మీ ఇంటి నుంచే ఎలా అప్‌డేట్ చేయవచ్చో పూర్తి ప్రాసెస్ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొబైల్ నంబర్ మార్పు కోసం అవసరమయ్యే డాక్యుమెంంట్లు ఇవే:
మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలనుకుంటే.. మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, కొత్త మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం వల్ల మీరు సకాలంలో, ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇంకా, భవిష్యత్తులో లైసెన్స్ రెన్యువల్, అడ్రస్ చేంజెస్ లేదా ఫేక్ లైసెన్స్‌లను పొందేందుకు కూడా మీ మొబైల్ నంబర్ చాలా అవసరం.
డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్ ఆన్‌లైన్‌లో ఎలా మార్చాలి?
- డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను మార్చేందుకు ముందుగా పరివాహన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- హోమ్ పేజీలో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సర్వీసెస్ ఆప్షన్ (Services)పై క్లిక్ చేయండి.
- మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
- ముందు లాగిన్ అవ్వండి. (Update MObile Number) లేదా చేంజ్ మొబైల్ నంబర్ (Change Mobile Number)ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయండి.
- ఇప్పుడు అన్ని సమాచారం సరిగ్గా ఉంటే (Submit) ఆప్షన్ క్లిక్ చేయండి.
- చాలావరకూ, డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను మార్చేందుకు ఎలాంటి రుసుము ఉండదు. కానీ, వివిధ రాష్ట్రాల్లో నియమాలను బట్టి మార్పులు ఛార్జీలు ఉండొచ్చు.
ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయకపోతే ఏం చేయాలి?
ఏదైనా కారణంతో మీ మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయకుంటే వెంటనే మీ సమీపంలోని RTO ఆఫీసును కూడా విజిట్ చేయొచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డును మీతో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







