జెబెల్ షమ్స్‌లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- January 21, 2026
మస్కట్: ఒమన్ అంతటా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జెబెల్ షమ్స్‌లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ టెంపరేచర్ మైనస్ 0.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని పౌర విమానయాన అథారిటీ (CAA) విడుదల చేసిన డేటా తెలిపింది.
మస్కట్ నుండి ఎత్తైన ప్రాంతానికి తరచుగా ప్రయాణించే వారు ఉష్ణోగ్రతలలో భారీ మార్పులను చూస్తున్నట్లు తెలిపారు. "రాత్రిపూట గాలి చాలా బలంగా ఉంది. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయింది. భారీ దుస్తులు ధరించినప్పటికీ, ఎక్కువసేపు బయట ఉండటం కష్టంగా ఉంది," అని భారతీయ ప్రవాస సూరజ్ కుమార్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఇక సైక్‌లో 4.8°C, యాంకుల్‌లో 9.5°C , నిజ్వాలో 11.5°C నమోదు కాగా, ఫహూద్ 11.5°C మరియు ముఖ్షిన్ 11.3°C, హైమాలో 11.0°C, అస్ సునైనాలో 11.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటుందని, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వాహనదారులకు లో విజిబిలిటీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







