ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- January 21, 2026
దోహా: ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్‌గార్టెన్‌లు సామాజిక బాధ్యత కార్యక్రమం కింద ఆయా సీట్లను ఆఫర్ చేస్తున్నాయని, ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ నమోదు చేసుకోవాలని సూచించింది. మొత్తం 3,500 కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఒకసారి జాయిన్ అయిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసే వరకు ఇది స్కీమ్ కొనసాగుతుందని తెలిపింది.
ఇక ఉచిత సీట్ల కోసం మొత్తం కుటుంబ ఆదాయం 10,000 ఖతారీ రియాల్స్‌ను మించకూడదు. రాయితీ సీట్ల కోసం ఆదాయ పరిమితి 15,000 రియాల్స్‌గా నిర్ణయించారు. ఖతారీ విద్యార్థుల కోసం కేటాయించిన సీట్లు 25,000 రియాల్స్‌కు మించని ఆదాయం ఉన్న కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!







