ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ

- January 21, 2026 , by Maagulf
ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ

దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక భేటీ నిర్వహించారు. ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్‌విడియా (NVIDIA) గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ విభాగం ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మెండ్తో సీఎం సమావేశమై రాష్ట్రంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విస్తృత అవకాశాలపై చర్చించారు.

అమరావతిలో తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
ఈ సందర్భంగా అమరావతిలో తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు అంశాన్ని చంద్రబాబు ఆమె ముందుంచారు. ఏఐ పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన టాలెంట్‌ను తయారు చేసే దిశగా ఈ యూనివర్సిటీ కీలకంగా మారుతుందని సీఎం వివరించారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు, హై ఎండ్ హార్డ్‌వేర్ తయారీ యూనిట్లు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై ఎన్‌విడియా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఏఐ, డీప్ టెక్, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఏఐ, డీప్ టెక్, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ భాగస్వామ్యాల ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, భారీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ భేటీతో ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పెట్టుబడులు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com