UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్

- January 21, 2026 , by Maagulf
UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్

దోహా: ఖతార్ UNRWAకు భౌతికంగా, నైతికంగా మరియు రాజకీయంగా మద్దతు ఇవ్వడం కొనసాగిస్తుందని ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) ప్రతినిధి డాక్టర్ మాజెద్ మొహమ్మద్ అల్-అన్సారీ తెలిపారు.

UNRWAకు మరియు అన్ని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలకు వారి మిషన్లను నిర్వహించడంలో మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ మిషన్లకు ప్రమాదం కలిగించడానికి, అంతర్జాతీయ చట్టబద్ధతను బలహీనపరచడానికి లేదా అంతర్జాతీయ సంస్థల పనికి ఆటంకం కలిగించడానికి అనుమతించవద్దని పిలుపునిచ్చారు. 

తూర్పు జెరూసలేంలో UNRWA ఫెసిలిటీస్ కూల్చివేతలపై ఖతార్ తీవ్రంగా మండిపడింది.  పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ మరియు కార్యనిర్వాహక సంస్థ (UNRWA) తన పనిని నిర్వహించడంలో మద్దతు ఇవ్వవలసిన ఆవశ్యకతపై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల పాలస్తీనా పౌరుల జీవితాలు మరింత దిగజారుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.  

బోర్డ్ ఆఫ్ పీస్‌లో ఖతార్ చేరిందని,  ఖతార్ మొదటి రోజు నుండే ఈ ఫ్రేమ్‌వర్క్‌లో పాలుపంచుకుందని, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 20-సూత్రాల ప్రణాళికకు సంబంధించి షర్మ్ ఎల్-షేక్‌లో ఒప్పందంపై సంతకం చేసిన పక్షాలలో ఖతార్ కూడా ఒకటి అని అల్ అన్సారీ తెలియజేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com