ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- January 21, 2026
భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలనేనని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచం సహించకూడదని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రపంచ దేశాల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. దిల్లీలో స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్‌తో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇరుదేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. ఉమ్మడి సవాళ్లపై దేశాలు పరస్పరం సహకరించడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఈ సహకారం మరింత అవసరం. భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలు. ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు సహించకూడదు. టెర్రరిజం పట్ల జీరో టాలరెన్స్ ప్రదర్శించాలి.” అని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు.
భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలు
అలాగే స్పెయిన్‌లోని కార్డోబాలో జనవరి 18న జరిగిన రైలు ప్రమాదంపైనా జైశంకర్ స్పందించారు. ఆ రైలు యాక్సిడెంట్‌లో మరణించిన 40 మంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలువాలని ఆకాక్షించారు. కాగా, పట్టాలు తప్పిన హైస్పీడ్ రైలును మరో హైస్పీడ్ రైలు ఢీకొనడంతో స్పెయిల్‌లో దుర్ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో 40 మంది చనిపోగా, మరో 150 మందికిపైగా గాయపడ్డారు. “భారత్, స్పెయిన్ స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి అని జైశంకర్ వెల్లడించారు.
ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
సంస్కృతి, పర్యాటకం, కృత్రిమ మేధస్సు కోసం ఉద్దేశించిన డ్యూయల్ ఇయర్‌కు సంబంధించిన లోగో భారత్, స్పెయిన్ ఉమ్మడి దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ” అని అల్బరేస్ వెల్లడించారు. ప్రపంచంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో భారత్ వంటి విశ్వసనీయ దేశంతో స్పెయిన్ సంబంధాలను పెంపొందించుకోవడం చాలా అవసరమని అల్బరేస్ అభిప్రాయపడ్డారు. “ప్రపంచంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్న ఈ సమయంలో అంతర్జాతీయ చట్టాన్ని విశ్వసించే, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను సమర్థించే భారత్ వంటి విశ్వసనీయ దేశంతో సంబంధాలను పెంపొందించుకోవడం స్పెయిన్‌కు చాలా ముఖ్యం. ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరితే ఒక సానుకూల సంకేతం అవుతుంది. స్పెయిన్, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ఆర్థిక వ్యవస్థలు. ” అని అల్బరేస్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







