మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- January 21, 2026
ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట భారత, పాకిస్థాన్ సైన్యాల మధ్య కాల్పులు జరిగాయి. గత రాత్రి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి.
సరిహద్దు భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నియంత్రణ రేఖ వెంట బ్లైండ్ స్పాట్లను తొలగించేందుకు కేరన్ బాలా ప్రాంతంలో 6 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు అధునాతన నిఘా కెమెరాలను అమర్చుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
నిఘా కెమెరాల ఏర్పాటును అడ్డుకునేందుకు పాకిస్థాన్ దళాలు 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. దీనికి ప్రతిగా భారత సైన్యం ఒక రౌండ్ కాల్పులు చేపట్టింది.
ప్రాణనష్టం ఏమన్నా జరిగిందా? అన్న సమాచారం అందలేదు. ఈ కాల్పులు పాక్ నుంచి చొరబాటు ప్రయత్నానికి దారి మళ్లించే యత్నమై ఉండవచ్చన్న అనుమానంతో భారత సైన్యం దట్టమైన అటవీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
చలికాలంలో చొరబాటుకు వీలున్న మార్గాల్లో నిఘా కోసం సాంకేతిక పర్యవేక్షణ సాధనాలను నవీకరిస్తూ సెక్టార్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్ సైన్యం ఇటీవల మళ్లీ సరిహద్దు ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత మళ్లీ ఇప్పుడు పాక్ ఇటువంటి ఘటనలకు పాల్పడుతుండడం గమనార్హం.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







