సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- January 21, 2026
అమెరికా: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో సెయింట్ లూయిస్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక మహాత్మగాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నిస్థానిక తెలుగు వారితో పాటు పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీ దర్శి (ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ శేఖర్ వంగల (సైకియాట్రిస్ట్) రోగులకు వైద్య సేవలు అందించారు. రోగుల ఆరోగ్య సమస్యలను నిశితంగా పరిశీలించిన వైద్యులు, వారికి అవసరమైన పలు రకాల వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మిస్సోరీలో నాట్స్ చేపడుతుందని తెలిపారు. ప్రతి నెల మిస్సోరీలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులను, మిస్సోరీ నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







