'వనం-మనం' కార్యక్రమం ఉద్యమంలా
- July 28, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో 'వనం-మనం' కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ఇవాళ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు 'వనం- మనం' కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
* తూర్పుగోదావరిజిల్లా కాకినాడ తిలక్‌వీధిలో హోం మంత్రి చినరాజప్ప వనం-మనం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. * విశాఖ కంభాలకొండ అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ ప్రవీణ్, అధికారులు పాల్గొన్నారు. * గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం నల్లపాడు రిజర్వ్ ఫారెస్టులో 'వనం-మనం' కార్యక్రమాన్ని మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రారంభించారు. జిల్లాల్లో 16.50 లక్షల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. * తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, మేయర్ రజనీశేషసాయి పాల్గొని మొక్కలు నాటారు. * విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో 'వనం-మనం' కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మొక్కల పెంపకంపై అవగాహన కోసం వేలమంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







