చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- January 22, 2026
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని పనులు చేస్తున్న కాలంలో చంద్రుడు పైన కాలు మోపడం మాత్రమే కాదు, చంద్రుడి పైన జీవితాన్ని స్థాపించడం కూడా పెద్ద విషయం ఏమీ కాదు. చాలాకాలంగా భూమి మీద కాకుండా మనిషి ఎక్కడ జీవించాలి అనే దానిపైన పరిశోధనలు చేస్తున్న మన ఆస్ట్రోనాట్స్, చంద్రుడు పైన జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని గుర్తించారు. చంద్రుడిపైన హోటల్ చంద్రమండలం పైన నీరు, ఖనిజాల పైన ఇప్పటికే ప్రపంచవ్యాప్త అన్వేషణ కొనసాగుతున్న వేళ తాజాగా ఒక యూఎస్ కంపెనీ చంద్రుడి (Moon)పై ఏకంగా ఒక నిర్మాణాన్ని చేపట్టడానికి నిర్ణయించింది. ఈ క్రమంలోనే చంద్రుడు పైన హోటల్ నిర్మాణం చేయడానికి అమెరికన్ స్టార్టప్ కంపెనీ రంగంలోకి దిగింది. కాలిఫోర్నియాకు చెందిన గెలాక్సీ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్ చంద్రుడు పైన హోటల్ నిర్మాణం చేపడతామని గత ఏడాది ప్రకటించింది.
చంద్రమండలం పైన ఆవాస గృహాలను ఏర్పాటు
హోటల్ నిర్మాణం మాత్రమే కాదు ఏకంగా బుకింగ్స్ కూడా ఈ సిలికాన్ వ్యాలీ సంస్థ చంద్ర పర్యాటకాన్ని లూనార్ ఎకానమీకి తొలిమెట్టుగా భావిస్తోంది. ఇప్పటికే చంద్రమండలం పైన ఆవాస గృహాలను ఏర్పాటు చేయాలని సైన్సు ఫిక్షన్ ఆలోచన ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ఇక సదరు కంపెనీ వెబ్సైట్ హోటల్ నిర్మాణం మాత్రమే కాదు ఏకంగా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం హోటల్ రిజర్వేషన్లు 2.2 కోట్ల రూపాయల నుండి 9 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. మొత్తం ఖర్చు ఇలా చంద్రమండలానికి వెళ్లి హోటల్లో బస చేసి వచ్చే మొత్తం ప్రయాణానికి 90 కోట్లు దాటే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తుంది. అదనంగా తిరిగి చెల్లించని వెయ్యి డాలర్ల దరఖాస్తు రుసుము కూడా చెల్లించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







