మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి

- January 22, 2026 , by Maagulf
మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచే మేడారం జాతరకు ప్రత్యేకంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా భక్తులు తక్కువ సమయంలో సౌకర్యవంతంగా మేడారం చేరుకునే అవకాశం కల్పించారు. అలాగే జాతర ప్రాంతాన్ని ఆకాశం నుంచి వీక్షించే అరుదైన అనుభవం కూడా లభించనుంది.

పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ – విహంగ వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు
మేడారం సమీపంలోని పడిగాపూర్ గ్రామం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ సేవల ద్వారా భక్తులు 6 నుంచి 7 నిమిషాల పాటు జాతర ప్రాంతాన్ని విహంగ వీక్షణ చేసే జాయ్ రైడ్ను ఆస్వాదించవచ్చు. ఈ ప్రత్యేక ప్రయాణానికి ఒక్కొక్కరి నుంచి రూ.4,800 ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇది జాతరకు వచ్చే భక్తులకు ఒక కొత్త అనుభూతిని అందించనుంది.

హనుమకొండ నుంచి మేడారానికి రానుపోను హెలికాప్టర్ సేవలు
హనుమకొండ (HNK) నుంచి మేడారానికి రానుపోను హెలికాప్టర్ సేవలకు రూ.35,999 ఛార్జ్ నిర్ణయించారు. ఈ హెలికాప్టర్ సేవలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఎక్కువ మంది భక్తులు సులభంగా దర్శనం చేసుకునేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com