సౌదీలో అమల్లోకి సౌదీయేతర రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ రెగ్యులేషన్స్..!!

- January 23, 2026 , by Maagulf
సౌదీలో అమల్లోకి సౌదీయేతర రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ రెగ్యులేషన్స్..!!

రియాద్ః  సౌదీయేతరుల రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ రెగ్యులేషన్స్ అధికారికంగా అమలులోకి వచ్చాయని సౌదీయేతర రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ  ప్రకటించింది. సౌదీయేతరుల రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ కోసం దరఖాస్తులు అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్, సౌదీ ప్రాపర్టీస్ ద్వారా ప్రత్యేకంగా అప్లై చేయాలని సూచించారు.నివాసితులు, అలాగే సౌదీయేతర కంపెనీలు, సంస్థలకు కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. దరఖాస్తుదారుడి కేటగిరిని బట్టి దరఖాస్తు ప్రక్రియ మారుతుందని స్పష్టం చేసింది.
సౌదీ అరేబియా నివాసితులు తమ నివాస (ఇఖామా) నంబర్‌ను ఉపయోగించి పోర్టల్ ద్వారా నేరుగా దరఖాస్తులను సమర్పించవచ్చు. నివాసితులు కాని వారి కోసం, విదేశాలలో ఉన్న సౌదీ మిషన్లు మరియు రాయబార కార్యాలయాల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇక సౌదీలో లేని సౌదీయేతర కంపెనీలు మరియు సంస్థలు ముందుగా ఇన్వెస్ట్ సౌదీ ప్లాట్‌ఫామ్ ద్వారా పెట్టుబడి మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోవాలని, ఎలక్ట్రానిక్‌గా యాజమాన్య దరఖాస్తులను సమర్పించే ముందు ఏకీకృత సంఖ్య పొందాల్సి ఉంటుందని పేర్కొన్నది. అయితే, మక్కా మరియు మదీనాలో ఓనర్షిప్ హక్కులు సౌదీ కంపెనీలు మరియు ముస్లిం వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసినట్లు అథారిటీ అధికారిక ప్రతినిధి తైసీర్ అల్ మోఫరేజ్ తెలిపారు.
సౌదీ ప్రాపర్టీస్ పోర్టల్ నిబంధనలను అమలు చేయడానికి అధికారిక డిజిటల్ గేట్‌వేగా పనిచేస్తుందని అన్నారు. దరఖాస్తుదారులు విధానాలను పూర్తి చేయడానికి, రెగ్యులేషన్స్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాదో లేదో ధృవీకరించడానికి మరియు జాతీయ రియల్ ఎస్టేట్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌కు నేరుగా ఉన్న కనెక్టింగ్ వ్యవస్థ ద్వారా ఓనర్షిప్ ను ఖరారు చేయడానికి వీలు కల్పిస్తుందని వివరించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com