రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా 21 పెట్రోల్ బంకులు
- July 29, 2016
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా 21 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత చెప్పారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో పెట్రోల్ బంకు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రెండు బంకులు నడుస్తున్నాయని, వాటిని విస్తరిస్తామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, జేసీ వివేక్ యాదవ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆర్‌డీఓ దయానిధి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







