చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- January 24, 2026
కువైట్: కువైట్ లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లలో చలి కుంపట్లు వేసుకోవడం సాధారణంగా మారింది. ఈ క్రమంలో జనరల్ ఫైర్ ఫోర్స్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇళ్ళు లేదా గుడారాల లోపల కోల్ ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ ఫైర్ ఫోర్స్‌లోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గరీబ్ అల్-రాయ్ సూచించారు.
కోల్ ను మండిచడం కారణంగా కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు విడుదల అవుతుందని, ఇది సైలంట్ కిల్లర్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా మూసివున్న ప్రాంతాలలో ఇది వేగంగా పేరుకుపోతుందని, తక్కువ సమయంలోనే స్పృహ కోల్పోయి ఊపిరాడక అపస్మారక స్థితికి చేరతారని హెచ్చరించారు.
ఇళ్ళు, గదులు లేదా మూసివున్న గుడారాల లోపల కోల్ ను ఉపయోగించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఒకవేళ దానిని ఉపయోగించాల్సి వస్తే, తగినంత వెంటిలేషన్ ఉన్న బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఉపయోగించాలని సూచించారు. రాత్రి సమయాల్లో మండించి వదిలివేయవద్దని, తద్వారా ప్రాణాలకు అపాయం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. అత్యవసర సమయంలో నంబర్ 112ను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







