గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- January 24, 2026
దోహా: 2026లో పర్యాటక నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ పనితీరులో దోహా ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మొబైల్ డేటా స్పెషలిస్టు హోలాఫ్లీ అధ్యయనం తెలిపింది. ప్రముఖ పర్యాటక కేంద్రాలలో సగటు స్థానిక మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని ఉపయోగించి 1-గిగాబైట్ నగర మ్యాప్‌ను డౌన్లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో పరిశోధకులు లెక్కించారు.
దోహా సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 354.5 Mbps తో.. గిగాబైట్ మ్యాప్‌ను డౌన్లోడ్ చేయడానికి 3 సెకన్ల కంటే తక్కువ సమయం పట్టింది. దుబాయ్ మరియు అబుదాబి సిటీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఇక ర్యాంకింగ్‌లో అట్టడుగున హవానా, క్యూబా ఉందని, ఇక్కడ సగటు వేగం 4 Mbps కంటే కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల 1 GB మ్యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నిమిషాలు పడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







