మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- January 25, 2026
మస్కట్: ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, నోవాస్పేస్‌తో కలిసి మిడిలీస్టు అంతరిక్ష సదస్సు రెండవ ఎడిషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది జనవరి 26న ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సదస్సు మంత్రిమండలి జనరల్ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ అయిన హిజ్ హైనెస్ సయ్యద్ డాక్టర్ కామిల్ బిన్ ఫహద్ అల్ సయీద్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతికత అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ బిన్ అమేర్ అల్ షిధాని సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 20కి పైగా దేశాల నుండి 190కి పైగా సంస్థలకు చెందిన 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. మిడిలీస్టులో అంతరిక్ష టెక్నాలజీ వృద్ధికి ఒమన్ సదస్సు మార్గనిర్దేశం చేస్తుందన్నారు.
ఈ సదస్సు నిర్వాహణ కారణంగా ఒమన్ లో అంతరిక్ష సంబంధిత ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చే అవకాశం ఉందని, తద్వారా జీసీసీలో అంతరిక్ష రంగంలో ఒమన్ కీలకంగా మారుతుందని డాక్టర్ అలీ బిన్ అమేర్ పేర్కొన్నారు. అతిథులకు ఒమన్ లోని కీలక పర్యాటక ప్రదేశాలను పరిచయం చేయనున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







