అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్‌ ను మూసేసిన దుబాయ్..!!

- January 25, 2026 , by Maagulf
అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్‌ ను మూసేసిన దుబాయ్..!!

దుబాయ్: దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) అల్ ఖుద్రా ప్రాంతంలోని సైక్లింగ్ ట్రాక్‌ను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. 2025–2026 అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్  10వ ఎడిషన్ మహిళల రేసు నిర్వాహణ కోసమే మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తన ప్రకటనలో తెలిపింది. ఇక మూసివేత ఆంక్షలు జనవరి 25న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ లో మహిళల రేసు ముగిసిన వెంటనే ట్రాక్ తిరిగి ఓపెన్ చేస్తామని అథారిటీ  వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com