సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- January 29, 2026
రియాద్: సౌదీ అరేబియా వాతావరణం వేగంగా మారుతోంది. జాతీయ వాతావరణ కేంద్రం అనేక ప్రాంతాలకు రెడ్ అలర్ట్‌లను జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ ఒక కిలోమీటరు కంటే తక్కువగా తగ్గిందని, ఇది వాహనదారులకు మరియు ప్రయాణికులకు తీవ్రమైన ప్రమాదాలను కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా తూర్పు ప్రావిన్స్‌లో, అల్ జుబైల్, అల్ ఖోబర్, దమ్మామ్, అల్ ఖతీఫ్ మరియు రాస్ తనురాలో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని తెలిపింది.
అదే సమయంలో తూర్పు ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అల్ కామెల్, రిహాత్ మరియు మద్రాకా ప్రాంతాలతోపాటు అజ్ జుల్ఫీ, అల్ ఘాట్, అల్ మజ్మా మరియు షక్రా సహా రియాద్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నివాసితులు మరియు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని వాతావరణ కేంద్రం కోరింది.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







