కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- January 29, 2026
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, కువైట్ మొత్తం జనాభా ఐదు శాతం పెరిగి 5.237 మిలియన్లకు చేరుకుంది. ఇందులో భారతీయులు అతిపెద్ద ప్రవాస సముదాయంగా కొనసాగుతున్నారు. మొత్తం జనాభా 4.988 మిలియన్ల నుండి పెరిగినప్పటికీ, కువైట్ పౌరుల సంఖ్య సుమారు 5,000 తగ్గింది. గత సంవత్సరం చివరి నాటికి కువైట్ జనాభా 1.563 మిలియన్లుగా ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరం 1.68 మిలియన్లుగా ఉంది. దీంతో మొత్తం జనాభాలో వారి వాటా 31.4 శాతం నుండి 29.85 శాతానికి తగ్గింది.
ప్రవాస జనాభా 7.3 శాతం పెరిగి, 3.42 మిలియన్ల నుండి 3.67 మిలియన్లకు చేరుకుంది. కువైట్ నివాసితులలో వీరి జనాభా 71 శాతానికి పైగా ఉన్నారు. ప్రవాసుల సంఖ్యలో భారతీయులు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఒక సంవత్సరం ముందున్న 1.008 మిలియన్ల నుండి గత సంవత్సరం చివరి నాటికి 1.059 మిలియన్లకు పెరిగారు. భారతీయ సమాజం ఇప్పుడు కువైట్ మొత్తం జనాభాలో సుమారు 20 శాతం మరియు మొత్తం ప్రవాసులలో దాదాపు 29 శాతంగా ఉంది.
ఇక మొత్తం గృహ సహాయకులలో 40.1 శాతం మంది భారతీయులే ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 343,000 అని నివేదిక తెలిపింది. మొత్తంగా, కువైట్‌లో గృహ సహాయకుల సంఖ్య గత సంవత్సరం 823,000 నుండి నాలుగు శాతం పెరిగి 856,000కి చేరుకుంది. ఇది మొత్తం జనాభాలో 16 శాతం మరియు మొత్తం లేబర్ ఫోర్సులో 27 శాతంగా ఉంది.
కువైట్ ప్రైవేట్ రంగంలోని 1.83 మిలియన్ల లేబర్ ఫోర్సులో భారతీయులు 30.8 శాతం, ఆ తర్వాత ఈజిప్షియన్లు 23.9 శాతంగా ఉన్నారు. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులలో దాదాపు ముప్పావు వంతు మంది కువైటీలే అయినప్పటికీ, ప్రైవేట్ రంగ ఉద్యోగులలో వారి వాటా కేవలం 3.7 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







