ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!

- January 30, 2026 , by Maagulf
ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!

దోహా: ఖతార్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీగా జరిమానా విధించడంతోపాటు జైలు శిక్షను విధించనున్నారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక అవగాహన పోస్ట్‌ చేసింది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం రహదారి భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని అందులో పేర్కొంది.  

ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ (94) ప్రకారం, వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఒక నెల నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, మరియు QR10,000 మరియు QR50,000 మధ్య జరిమానా, లేదా ఈ రెండు శిక్షలలో ఏదో ఒకటి విధించబడుతుందని హెచ్చరించింది.  అయితే, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండి, అధికారుల చెకింగ్ సమయంలో ఫిజికల్ కార్డును వెంట తీసుకెళ్లని డ్రైవర్లు.. మెట్రాష్ అప్లికేషన్ ద్వారా లైసెన్స్‌ ను డిజిటల్‌గా ధృవీకరించుకునే సౌకర్యం ఉందని తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com