చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్‌లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- January 30, 2026
అమెరికా: అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన గొట్టుముక్కల మధుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొన్ని సున్నితమైన కాంట్రాక్ట్ పత్రాలను చాట్‌జీపీటీ (ChatGPT) పబ్లిక్ వెర్షన్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సమాచారం బయటకు పొక్కకుండా లేదా పొరపాటున బహిర్గతం కాకుండా అడ్డుకునేలా రూపొందించిన ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలర్ట్‌లు ఈ విషయాన్ని గుర్తించాయని అధికార వర్గాలను ఉటంకిస్తూ పొలిటికో రిపోర్టు చేసింది.
ఈ పరిణామాల పై సీఐఎస్‌ఏ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మార్సీ మెక్‌కార్తీ స్పందిస్తూ... మధు గొట్టుముక్కలకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) నిబంధనల ప్రకారం కొంతకాలం పాటు పరిమితంగా చాట్‌జీపీటీని వాడటానికి అనుమతి ఇచ్చామని తెలిపారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్‌లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







