ప్రాజెక్ట్ SSR61 అనౌన్స్‌మెంట్- త్వరలోనే టైటిల్ రివిల్

- January 31, 2026 , by Maagulf
ప్రాజెక్ట్ SSR61 అనౌన్స్‌మెంట్- త్వరలోనే టైటిల్ రివిల్

రిజినాలిటీకి, వినూత్న ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడికి క్రియేటివ్ సహకారం అందించిన తర్వాత, ఇప్పుడు సింగీతం స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటూ SSR61 ని తెరకెక్కిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను ఇవాళ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో సింగీతం  క్రియేటివిటీ, ఆయన సినిమాలపై ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేసే క్లిప్స్ ఆకట్టుకున్నాయి. పుష్పక విమానం, ఆదిత్య 369 లాంటి క్లాసిక్స్‌ను మరోసారి గుర్తు చేశాయి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. అనుభవం, ఆధునిక ఆలోచనలు కలిసి వస్తున్న ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం సినిమాకు మరింత ఎనర్జీని తీసుకురానుంది.

వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని సింగీతం గారి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా అభివర్ణించింది. త్వరలోనే టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా నిలవనుంది.

ఇది సింగీతం గారి రీ-ఎంట్రీ మాత్రమే కాదు, ఆయన తననే తాను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. SSR61 ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com