దక్షిణ ఇరాన్‌లో భూకంపం..యూఏఈ సేఫ్..!!

- February 01, 2026 , by Maagulf
దక్షిణ ఇరాన్‌లో భూకంపం..యూఏఈ సేఫ్..!!

యూఏఈ: దక్షిణ ఇరాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూఏఈ నేషనల్ సిస్మిక్ నెట్‌వర్క్ వెల్లడించింది. యూఏఈ బార్డర్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నప్పటికీ, యూఏఈలో భూకంప ప్రభావం అంతగా లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.   

యూఏఈ ప్రధాన భూకంప జోన్‌లో లేనప్పటికీ, ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు ప్రకంపనలు సంభవిస్తాయని పేర్కొంది. ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నందున, కొన్నిసార్లు ఎమిరేట్స్ అంతటా స్వల్ప ప్రకంపనలను ప్రజలు అనుభవిస్తారని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com